ఆంధ్రప్రదేశ్లోఫిబ్రవరి 15 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ |NEW RATION CARDS RELEASE IN AP

ఆంధ్రప్రదేశ్లో 18.72 లక్షల రేషన్ కార్డులు కోత

1.29 కోట్ల కుటుంబాలకి బియ్యం కార్డు లో
ఫిబ్రవరి 15 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ

ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల వడపోత పూర్తయింది రాష్ట్రంలో కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం కార్డులకు అర్హుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఐతే రాష్ట్రము లో దాదాపు 18.72 లక్షల కుటుంబాలను అనర్హులగా ప్రభుత్వం తేల్చింది.. ఒక్కో కుటుంబానికి సగటున ముగ్గురు సభ్యులు చొప్పున చూసిన సుమారు 55.50 లక్షల మందికి నెల బియ్యం ఇతర సరుకుల పంపిణీ నిలిచిపోనుంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2.26 లక్షలు, కృష్ణాజిల్లాలో 2.11 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలో 1.94 లక్షలు కుటుంబాలకు కాపులకు అర్హత లేదని తేల్చారు రాష్ట్రంలో గుర్తించిన అనర్హుల్లో మూడోవంతు ఈ మూడు జిల్లాల్లో నుంచే ఉండటం గమనార్హం.

వడపోత ఇలా

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా బియ్యం కార్డు లను ఇవ్వాలని నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పథకాలకు అడుగులతో వేరుగా గుర్తిస్తుంది దీనికోసమే వైయస్సార్ నవశకం పథకాన్ని ప్రారంభించి ఇంటింటి సర్వే చేయించింది ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డ్ ల వివరాలను వాలంటీర్లకు ఇచ్చి జాబితాలు తయారు చేయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, నెలకు 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారు, 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్న వారిని అనర్హుల జాబితాలో చేర్చడం జరిగింది
వీటి ఆధారంగా ఈ నెల రెండు వరకు అభ్యంతరాలు స్వీకరణ జరిపి తుది జాబితా రూపొందించింది . కార్డు దారులందరి వివరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,001 గ్రామ సచివాలయాలు, క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. వీరందరికీ ఫిబ్రవరి 15 నుంచి కొత్త బియ్యం కార్డు ఇచ్చి…. మార్చి నుంచి రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అర్హులు ఉంటే దరఖాస్తులు తీసుకొని ప్రతి నెల కొత్త కార్డులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు