ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెంపు|ap latest news

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 500 యూనిట్లు పైన విద్యుత్ను వినియోగించే లబ్ధిదారుల పైన పెంచిన అధిక విద్యుత్ చార్జీల భారం పడనుంది. 500 యూనిట్లు దాటితే యూనిట్ కి 90 పైసలను ప్రభుత్వం పెంచింది యూనిట్ ధరను 9రూ నుంచి 9.95 రూ టారిఫ్ ను ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేట్ సంస్థల పై కూడా ఈ పెరిగిన విద్యుత్ చార్జీల భారం పడనుంది

రానున్న ఆర్థిక సంవత్సరానికి44,840.86 కోట్లు అవసరమవుతాయని వార్షిక ఆదాయ అవసర నివేదికలో డిస్కంలు పేర్కొన్నాయి. 2020-21 లో సమకూర్చుకోగలిగే రాబడి, నిర్వహణకు అయ్యే వ్యయం, ఏర్పడే లోటు తదితర అంశాలను డిస్కంలు ఏ ఆర్ ఆర్ లో పొందు పరిచాయి. అందుకు తగ్గట్టుగానే చార్జీల పెంపు అనివార్యం అయింది. ఈ పెరిగిన విద్యుత్ చార్జీల పెంపు 500 యూనిట్లు దాటిన వారికి మాత్రమే వర్తించనుంది