ఆంధ్రప్రదేశ్లో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు | ap latest government jobs update

50 వేల కు పైగా ఉద్యోగ ఖాళీల గుర్తింపు పై కసరత్తు

నేటి లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని శాఖలకు ఆదేశాలు

31 న జరిగి భేటీలో నిర్ణయం

ఏకకాలంలో వార్షిక పట్టికల జారీ?

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల గుర్తింపు పై కసరత్తు పెరిగింది. అన్ని శాఖల అధికారులు తమ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది

డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjy

ప్రతి శాఖలో మంజూరు చేసిన పోస్టులు పదోన్నతులు ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేయాల్సిన పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి? మంజూరైన పోస్టులో పొరుగు సేవలు, ఒప్పంద విధానం లో పనిచేస్తున్న వారి సంఖ్య, గ్రామ వార్డు సచివాలయ రాకతో అవసరం లేని పోస్టులు ఎన్ని? కొత్తగా సృష్టించాల్సిన పోస్ట్ లో ఏమైనా ఉన్నాయా? ఇతర వివరాలను గురువారం లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని గడువు విధించింది. రేపు జరిగి ఏపీ సీఎం జగన్ యొక్క సమావేశంలో వీటిపై పలు కీలక నిర్ణయాలు నిలబడి ఉన్నాయి

వివిధ శాఖల్లో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ప్రభుత్వం గుర్తించిన ఖాళీల వివరాలు

గ్రూప్ 1- 93

గ్రూప్ 2 -814

ఇంజనీరింగ్ సర్వీసెస్ – 768

గ్రూప్ 3 – 339

పోలీసు శాఖలో – 639

వైద్య శాఖలో – 7,872

విద్యాశాఖలో- 10 వేలు పైగా

అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 1,109

కానిస్టేబుళ్లు ఇతర పోస్టులు – 7,740

ఇవి కాకుండా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుల పోస్టుల తో పాటు మరికొన్ని పోస్టులు కలుపుకొని సుమారు 50 వేలకు పైగా ఖాళీలు గుర్తించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది