• Sat. Oct 16th, 2021

Andhrapradesh local body election postponed |ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా

Byadmin

Mar 15, 2020

కరోనా వైరస్ ప్రభావంతో AP లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ వెల్లడించారు. ఆరు వారాల అనంతరం సమీక్ష నిర్వహించి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు


అయితే ఇప్పటికీ ఏకగ్రీవమైన స్థానాలు అలాగే ఉంటాయని అక్కడ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి సమావేశం జరిపిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల సంఘానికి ఉన్న విస్తృత అధికారుల ద్వారా ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపి వేసినట్లు చెప్పారు

అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం వాయిదా మాత్రమే పడ్డాయని రద్దు కాలేదని చెప్పారు. కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలియజేశారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్కూల్లు, కళాశాలలు, మాల్స్ కూడా మూతపడ్డాయని గుర్తు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు గుమిగూడే అవకాశం ఉందని దాని వలన కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉందని. అవ్వటం అరికట్టడానికి నీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకోవటం జరిగిందని రమేష్ కుమార్ వెల్లడించారు

ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు సంబంధించిన పిడిఎఫ్ ని కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని CLICK చేసి డౌన్లోడ్ చేసుకోండి

CLICK HERE