
భారత్ లో మే 3 తో లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో భారత్ లోని మొత్తం 733 జిల్లాల పరిస్థితిని కేంద్రం పరిశీలించి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. ఇందులో 130 జిల్లాలు రెడ్ జోన్ లో ఉండగా ఈ జిల్లాల్లో లాక్డౌన్ గడువు మే 3 న ముగిసిన తర్వాత కూడా యధావిధిగా కఠిన ఆంక్షలను కొనసాగించనున్నారు. మిగిలిన ప్రాంతంలో పాక్షికంగా ఆంక్షలను సడలించనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో TS లో 6 జిల్లాలు, AP లో 5 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి.
తెలంగాణ రెడ్ జోన్ వివరాలు 👇
హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్
తెలంగాణ ఆరెంజ్ జోన్ వివరాలు 👇
నిజామాబాద్, గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల
తెలంగాణ గ్రీన్ జోన్ వివరాలు 👇
పేద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి,
ఆంధ్రప్రదేశ్ రెడ్ జోన్ వివరాలు 👇
కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ ఆరెంజ్ జోన్ వివరాలు 👇
పశ్చిమ గోదావరి, కడప, అనంతపూర్, ప్రకాశం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం
గ్రీన్ జోన్: విజయనగరం