ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్ విద్యార్థులకి శుభవార్త|కాలేజీలతో సంబంధం లేకుండా డైరెక్జ్ గా వెబ్సైట్ నుంచి హల్లటికెట్స్ డౌన్లోడ్ చేసుకునే వెసులు బాటు కల్పించిన ప్రభుత్వం

AP లోని ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కాలేజీల తో సంబంధం లేకుండా హాల్టికెట్లు పొందే సరికొత్త విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. 2019 వరకు హాల్టికెట్లను విద్యార్థులు చదివిన కళాశాలలకు పంపేవారు ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ హల్లటికెట్ పై సంతకం చేసి విద్యార్థులకు పంపిణీ చేసేవారు

అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ ప్రిన్సిపాల్ సంతకంతో హాల్టికెట్ ఉండాలన్న నిబంధన ని తొలగించింది దీంతో ఈ సంవత్సరం డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు పొందే వెసులుబాటును విద్యార్థులకు ఇంటర్ బోర్డు కల్పించింది

మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి 75 శాతం హాజరు కలిగిన విద్యార్థుల హాల్టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నత అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే 70 శాతం నుంచి 75 శాతం లోపు హాజరు ఉన్న విద్యార్థులు 1000, 65 నుంచి 70% హాజరు ఉంటే పదిహేను వందల రూపాయలు, 60 నుంచి 65 శాతం లోపు హాజరు ఉన్న విద్యార్థులు రెండు వేల రూపాయల అపరాధ రుసుమును బ్యాంకులో చెల్లించి ఆ రసీదును ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సమర్పిస్తే వారి హాల్ టికెట్లును ఇవ్వటం జరుగుతుంది

60% కంటే తక్కువ హాజరు ఉన్న విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వరు. అయితే ఆర్ట్స్ చదువుతున్న విద్యార్థులకు 60 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నప్పటికీ వెయ్యి రూపాయల అపరాధ రుసుము చెల్లిస్తే హాల్ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది.. అయితే వాళ్లు రెగ్యులర్ విద్యార్థిగా అవకాశం కోల్పోతారు ప్రైవేటు విద్యార్థులు గా పరిగణిస్తూ వారికి పరీక్ష రాసే అవకాశాన్ని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కల్పించనుంది

హాల్టికెట్ డౌన్లోడ్ కోసం bie.ap.gov.in లింక్ ని కట్ చేసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొనగలరు