ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు 30 లక్షల ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు

https://youtu.be/duSm8TbTjkU

NOTE: డైలీ కరెంట్ అఫైర్స్ఆన్లైన్ ఎగ్జామ్ పాకేజీలు జాయిన్్ కావాలనుకునేవారు 50rs 8008185316 కి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా చెల్లించి 9618965937 నెంబర్ కి స్క్రీన్ షార్ట్ తీసి పంపిన వెంటనే డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్ మరియు PDF 30 రోజులపాటు సెండ్ చేయడం జరుగుతుంది

నాలుగు సంవత్సరాల్లో 30 లక్షల ఇల్లు నిర్మాణం

ప్రతి ఇంటి పై పావలా వడ్డీకే 25 వేల వరకు రుణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నాలుగు సంవత్సరాలలో ఇల్లు లేని నిరుపేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, ఉగాది నాటికి 26.6 లక్షల ఇల్ల పట్టాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు స్థలాలు పొందనున్న పేదలతో పాటు, సొంత స్థలాలు ఉన్న వారికి ఇళ్లు నిర్మిస్తామని, ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి పై 25 వేల వరకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా బ్యాంక్ ల తో మాట్లాడి ఏర్పాటు చేస్తామని మిగతా వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం వివరించారు

పేదలు అధిక వడ్డీకి రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఇల్లు అన్నీ ఓకే నమూనాలో అందంగా ఉండాలని, నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. పేదలకు కట్టే ఇళ్లలో ఒక పడక గది, వంటగది, వరండా, మరుగుదొడ్డి ఉండేలా గృహ నిర్మాణ శాఖ రూపొందించిన డిజైన్లు సీఎం కొన్ని మార్పులు సూచించారు పేదలకు ఇల్లు నిర్మించే కాలనీలో చెట్లు నాటాలని తగిన ప్రణాళికతో మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కరెంటు, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు

గృహ నిర్మాణ శాఖ లోని 4,500 మంది ఇంజనీర్లతో పాటు గ్రామ వార్డు సచివాలయం లో కొత్తగా నియమితులైన వారిలో45 వేలమంది 30 లక్షల జిల్లా నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని వారందరికీ ఈ విషయంలో శిక్షణ ఇస్తామని తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఇంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14,907 వైయస్సార్ జగన్ అన్న కాలనీలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు

NOTE: డైలీ కరెంట్ అఫైర్స్ఆన్లైన్ ఎగ్జామ్ పాకేజీలు జాయిన్్ కావాలనుకునేవారు 50rs 8008185316 కి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా చెల్లించి 9618965937 నెంబర్ కి స్క్రీన్ షార్ట్ తీసి పంపిన వెంటనే డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్ మరియు PDF 30 రోజులపాటు సెండ్ చేయడం జరుగుతుంది