ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరలు

దేశం లోని వాహన దారుల పై మరోసారి భారీగా పెట్రోల్ డీజీల్ ధరల భారం పడనుంది దీనికి అనుగుణంగా పెట్రోల్ డీజీల్ మీద వ్యాట్ పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెట్రోల్ పై 31%వ్యాట్ తోపాటు లీటరుకు రూ 2.76 పై వరకు పెరగనుంది డీజీల్ మీద వ్యాట్ 22.25% తోపాటు లీటరుకు 3.07 రూ వరకు పెరగనునుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగటంతోనే ఈ పెంపు నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది

రాష్ట్రం లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 76.43 రూ ఉండగా. తాజాగా పెంచిన ధరలతో 76 పైసలు మేర పెరగనుంది. అలాగే లీటర్ డీజీల్ ధర ప్రస్తుతం 70.63 ఉండగా తాజా గా పెరిగిన ధరలతో మరో 1రూ మేర పెరగనుంది