• Wed. Jul 6th, 2022

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు |మార్చి 21, 24, 27 తేదీల్లో స్థానిక ఎన్నికలు

Byadmin

Mar 5, 2020

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు

ఎన్నికల సంఘం ఆమోదం కోసం ఎదురుచూపులు

ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నగారా మోగింది మార్చినెల 24 న మున్సిపల్, 27 న పంచాయతీ ఎన్నికలు, 21 న ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికలను నిర్వహించనున్నారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సూచించినట్లు సీఎం జగన్ బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సూత్రప్రాయంగా వెల్లడించడం జరిగింది

అయితే పోలింగ్ తేదీలపై ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుందని అభిప్రాయపడినట్లు వెల్లడించారు మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సన్నద్ధతపై మనుషులకు దిశానిర్దేశం చేశారు ఈ విషయమై మంత్రులతో మాట్లాడుతూ ఇప్పటికే 90 శాతం హామీలను నెరవేర్చామని, ఎన్నో పథకాలు తీసుకొచ్చామని ఇదివరకెన్నడూ లేని విధంగా BC, sc, st, మహిళల కోసం, మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు వంటి పనులు చేస్తామని ఎవరు అజాగ్రత్తగా ఉండదు అని కచ్చితంగా సింహభాగం గెలవాలి అని. డబ్బు మద్యం ఎక్కడ కనిపించకుండా ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు

డబ్బులు మద్యం పంపిణీ చేసినట్లు నిర్ధారణ అయితే, ఎన్నికైనా తర్వాత కూడా ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేయడం జరిగింది