• Fri. Oct 22nd, 2021

ఆంధ్రప్రదేశ్ లో 24,000 ప్రభుత్వ ఉద్యోగాలు కాలి |ap latest government jobs

APPSC LATEST JOBS

ఆంధ్రప్రదేశ్ లో 24 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ

సిఎస్ సమీక్షలో వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో 24 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని మంగళవారం నిర్వహించిన సమావేశం లో ఈ మేరకు రూపొందించిన నివేదికను అధికారులు అందజేశారు.
వీటిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య కలపలేదు అవి కూడా చేరితే దాదాపుగా 50 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు తేలనుంది
అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో కూడా భర్తీ చేయాల్సిన ఉద్యోగ వివరాలను సేకరించాలని అధికారులను ఈ సందర్భంగా CS ఆదేశించారు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న, నేరుగా భర్తీ చేయాల్సి ఉన్న ఖాళీల వివరాలను వెంటనే నిర్ధారించి, పూర్తిస్థాయిలో వివరాలను అందజేయాలని సూచించారు.

ఉద్యోగ ఖాళీలు ఇవే

డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjy

APPSC

  1. గ్రూప్ 1 – 93
  2. గ్రూప్ 2 – 814
  3. ఇంజనీరింగ్ సర్వీసెస్- 768
  4. గ్రూప్3 – 339
  5. 5.గ్రూప్ 4 – 639
  6. ఇతరాలు – 2, 608

పోలీసు శాఖ

  1. హోమ్ సర్వీసెస్ – 7,740
  2. ఇంజనీరింగ్ సర్వీసెస్ – 70
  3. గ్రూప్ 4 – 44

జిల్లా సెలక్షన్ కమిటీ

  1. మెడికల్ సర్వీసెస్ – 7,872
  2. గ్రూప్ 4 – 238
  3. ఇతరాలు – 2,178
  4. యూనివర్సిటీలు – 288
  5. jntu కాకినాడ – 110

మొత్తం 23,801