ఆంధ్రప్రదేశ్ లో 26 లక్షలు ఇళ్ల స్థలాలు పంపిణీ |ap free housing scheme

ఆంధ్రప్రదేశ్ లో 26 లక్షలు ఇళ్ల స్థలాలు పంపిణీ

ఉగాది రోజున అర్హుడైన ప్రతి పేదవాడికి పట్టాలు పంపిణీ

AP లో ఇల్లా స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఉగాది రోజున సుమారు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 43,141 ఎకరాల భూమిని యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేసి, మార్కింగ్, ప్లాట్లు వేసి సర్వం సిద్ధం చేసింది. గతంలో సర్కార్ పంపిణీ చేసేయ్ స్థలాలపై లబ్ధిదారులకు కేవలం వారసత్వ అనుభవం హక్కు మాత్రమే ఉండేది.

ప్రస్తుతం ఇల్లా స్థలాలు పొందే లబ్ధిదారులు ఇంటి నీ కట్టుకోవడానికి బ్యాంకులో తన కాబట్టి రుణం తీసుకోవడానికి ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించడానికి వీలుగా ప్రభుత్వం న్యాయపరమైన హక్కులు కల్పిస్తుంది ఈమేరకు నిర్దేశిత ఫార్మెట్లో స్టాంప్ పేపర్ పై రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఈ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఎమ్మార్వో లకు జాయింట్ సబ్ రిజిస్టర్ హోదా కల్పించాలని, MRO కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల గా గుర్తించాలని నిర్ణయించింది ప్రతి సంవత్సరం ఆరు లక్షల పైగా ఇళ్లు చొప్పున వచ్చే నాలుగు సంవత్సరాల్లో 26 లక్షల ఇళ్లు నిర్మించాలని వీటికి వైయస్సార్ జగన్ అన్న కాలనీ గా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది