• Fri. Oct 22nd, 2021

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Byadmin

Mar 7, 2020

ఏపీ మున్సిపల్‌ , పంచాయతీ, జడ్పీటీసీ, ఎంటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంటీసీ ఎన్నికలు ఒక విడతలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు . పంచాయతీ ఎన్నికలను మొత్తం రెండు విడతల్లో నిర్వహిస్తామన్నారు. కాగా 660 జడ్పీటీసీ, 9639 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇక ఒకే దశలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న ప్రకటిస్తారు. ఈ నెల 9నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. ఈ నెల 27న పంచాయతీ ఎన్నికల మొదటి విడత, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి . తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది అని రమేష్‌ కుమార్‌ తెలిపారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వివరాలు

మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
మార్చి 12: నామినేషన్ల పరిశీలన
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21: ఎన్నికల పోలింగ్‌
మార్చి 24: ఓట్ల లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వివరాలు

మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
మార్చి 14: నామినేషన్ల పరిశీలన
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌

మార్చి 15: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌

మార్చి 17: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29: ఎన్నికల పోలింగ్‌
మార్చి 29: ఓట్ల లెక్కింపు