ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2020 రద్దు

దేశం లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం ప్రకటించారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

పదో తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్‌లో ఫెయిల్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులంతా పాస్‌ అయినట్టు మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి‌ పేర్కొన్నారు. కాగా, తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.