ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులకు శుభవార్త |పరీక్ష కేంద్రం లో తమ సీటు ఎక్కడ ఉందో తెలుసుకోటానికి “నీ సీటు తెలుసుకో”పేరుతో ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు

ఇంటర్ పరీక్ష కేంద్రంలో “నీ సీటు తెలుసుకో “

ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక సదుపాయం

ఇంటర్ పరీక్షలు విద్యార్థులు పరీక్షా కేంద్రంలో తమ సీటు ఎక్కడుందో ఆన్లైన్లో తెలుసుకునేందుకు” నీ సీటు తెలుసుకో” పేరుతో ప్రత్యేక సదుపాయాన్ని ఇంటర్ విద్యా మండలి ప్రవేశపెడుతుంది మరోవైపు క్యూఆర్ కోడ్ తో హాల్ టకెట్లు జారీ చేయనున్నారు పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్ధి వివరాలు తెలుసుకోవాలంటే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే సరిపోతుంది

విద్యార్థి కలర్ ఫోటో సైతం వస్తుంది ఒకరికి బదులు మరొక విద్యార్థి పరీక్ష రాసే పద్ధతి నివారించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు పరీక్షా కేంద్రంలో సీటు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఇంటర్ విద్యా మండలి వెబ్సైట్లో హాల్టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేస్తే పరీక్షా కేంద్రం ఏ అంతస్థులో ఉంది సీటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు ఈ సదుపాయం పరీక్షకు ఒక రోజు ముందు నుండి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది

మార్చి 4న ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి విద్యార్థులు 3న వెబ్సైట్లో తమ సీటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు పరీక్షా కేంద్రాల్లో సీటు ఎక్కడుందో తెలుసుకునేందుకు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు

విద్యార్థుల హాల్టికెట్ లపై ప్రిన్సిపల్ సంతకం అనేది అవసరం లేదు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాయవచ్చు