ఉచిత బోర్ వెల్ అప్లికేషన్ ఫామ్ విడుదల |How to Download free Bore well Application Form

ఏపీలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే 90శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలకమైన హామీని నెరవేర్చింది. సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఉచిత బోర్‌వెల్స్ కార్యక్రమం అమలు చేయబోతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ పథకం అమలుపై విధి విధానాలను విడుదల చేశారు . బోరు డ్రిల్లింగ్‌ వేసేముందు రైతు పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోర్లు వేస్తారు. రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఒకవేళ రైతులకు అంత భూమి లేకపోతే పక్కనే ఉన్నవారితో కలిసి బోరు వేయించుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు.

లబ్ధిదారుడు పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్‌లైన్‌లో బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. అనంతరం అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేస్తారు. బోరు బావి మంజూరు సమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతులను తెలియజేస్తారు.

ఉచిత బోర్ వెల్ అప్లికేషన్ ఫామ్ కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి 👇

https://drive.google.com/file/d/1PMfS5YpMLVCupQ4r-6-IjgRBK63tA0x8/view?usp=drivesdk