ఏపీ శాసనమండలి రద్దు |ap latest news

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మరో సంచలన నిర్ణయం కి నాంది పలికింది ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ కేబినెట్ ఆమోదించింది. మరికాసేపట్లో దీనిపై తీర్మానం చేసి అసెంబ్లీలో పెట్టనున్నారు దీనిపై వెంటనే చర్చించి అసెంబ్లీ ఆమోదించనుంది

ఆ తరువాత కేంద్రానికి తీర్మానం కాపీని పంపనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది

ప్రస్తుతం శాసన మండలి లో చైర్మన్ తో కలిపి మొత్తం 58 మంది సభ్యులు ఉన్నారు అందులో టిడిపి 28, వైసిపి 9, పిడిఎఫ్ 5, బిజెపి 2, ఇండిపెండెంట్8, ఉండగా మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1958లో ఆర్టికల్ 168 కింద జూలై 1న శాసనమండలి తొలిసారిగా ఏర్పాటయింది అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ 1958 జూలై 8న మండల్ అని అధికారికంగా ప్రకటించారు మండలి ఆవిర్భవించిన 27 సంవత్సరాల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గారు రద్దు చేశారు

తిరిగి శాసన మండలి ని ఆంధ్రప్రదేశ్లో 2004లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 జూలై 8న శాసన మండలి పునరుద్ధరణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం తీసుకువచ్చారు. 2006 డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదం పొందింది. 2007 జనవరి 10న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. 2007 మార్చి 30న ఏపీ శాసనమండలి మళ్లీ ఏర్పాటయింది శాసన సభతో పాటు మండలి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తిరిగి మళ్లీ శాసనమండలి 13 సంవత్సరాల తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు అయినా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే శాసన మండలి రద్దు కావటం మరో విశేషం