• Wed. Jan 26th, 2022

కేంద్రం కీలక నిర్ణయం వారానికి 4 రోజులు మాత్రమే పని దినాలు !

Byadmin

Feb 9, 2021

కొత్త కార్మిక చట్టాలు ఫై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తుంది . కొత్త కార్మిక చట్టాలను అమలు చేయటానికి సిద్ద మవుతుంది కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే వారానికి 4 రోజులు మాత్రమే పని దినాలు ఉండనున్నాయి . అలాగే ఉచితంగా మెడికల్ చెకప్ కూడా ఉండనున్నట్లు సమాచారం

వారానికి 4 రోజుల పని దినాలే ఐన కూడా ఉద్యోగులు ఒక వారం లో 48 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అంటే 4 రోజులు పని చేయాల్సి వస్తే రోజు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది

ఐతే ఇది కంపెనీలు, ఉద్యోగులు ఇష్టం కేంద్రం ఎవ్వరి మీద ఒత్తిడి చేయదు కంపెనీలకు , ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం రెండు ఆప్షన్ లు ఇస్తుంది వారంలో 4 రోజులు పని చేయాలా లేదంటే వారం లో 6 రోజులు పని చేయాలా అనేది పూర్తిగా ఉద్యోగులు కంపెనీల ఇష్టం

వారు ఎ ఆప్షన్ ఐన ఎంచుకోవచ్చు ఐతే కంపెనీలు ఉద్యోగులు కచ్చితంగా ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది.

కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత కంపెనీలు 4 రోజులు, 5 రోజుల పని దినాలు కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు