మూడో దశకు చేరుకున్న ఫవిపిరవిర్ క్లినికల్ ట్రయల్స్
కొవిడ్-19 చికిత్సలో భారత్ ముందడుగు సత్ఫలితాస్తుందని భావిస్తున్న యాంటీ-వైరల్ మెడిసిన్ ‘ఫవిపిరవిర్’ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో కీలక దశకు చేరుకుంది మూడో దశలో భాగంగా దీన్ని కొవిడ్-19 రోగులపై పరీక్షించనున్నట్లు ‘గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్’ ప్రకటించింది . ఈ డ్రగ్‌ను పరీక్షించేందుకు గత నెల ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’(డీసీజీఐ) సంస్థకు అనుమతులు ఇచ్చింది . ‘ఫవిపిరవిర్’ కొవిడ్-19 నివారణకు జరుపుతున్న పరీక్షల్లో భారత్‌లో మూడో దశకు చేరిన తొలి సంస్థ తమదేనని గ్లెన్‌మార్క్ ప్రకటించింది
ప్రస్తుతం భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి మొత్తం పది సంభారత్ స్థలు ప్రయోగాలు జరుపుతున్నాయని గ్లెన్‌మార్క్ ప్రకటించింది . జులై లేదా ఆగస్టు నాటికి ఈ పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన సంస్థ . రోగుల పై చికిత్స చేయడానికి 14 రోజులు, అధ్యయనం చేయడానికి మరో 14 రోజులు మొత్తం పూర్తవడానికి 28 రోజులు పడుతుందని తెలిపింది. ఈ డ్రగ్ తయారీకి కావాల్సిన యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్(ఏపీఐ), సంబంధిత సూత్రీకరణలను సైతం రూపొందించినట్లు పేర్కొంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే కొవిడ్-19 చికిత్సలో ముందడుగు పడినట్లేనని సంస్థ ఉపాధ్యక్షురాలు మోనికా టాండన్ తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో ఇది కీలకంగా మారనుందని అభిప్రాయపడ్డారు.

జపాన్‌లో ఇన్‌ఫ్లుయంజా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ఫవిపిరవిర్‌ను కనుగొన్నారు. కొవిడ్-19 వెలుగుచూశాక చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కరోనా రోగులకు ఈ ఔషధాన్ని ఇచ్చి పరిశీలించగా . దీనివల్ల బాధితులు త్వరగా కోలుకున్నట్లు తేలింది. జపాన్‌కు చెందిన టొయామా కెమికల్ అనే కంపెనీ యొక్క ‘అవిగన్’ అనే బ్రాండుకు ఫవిపిరవిర్ జనరిక్ మెడిసిన్