గ్రామ సచివాలయ ఉద్యోగాలకు దరకాస్తు వెల్లువ
గత సంవత్సరం జరిగిన 2019 ఆగస్టు -సెప్టెంబర్ లో జరిగిన నియామక ప్రక్రియలో ఒక్కో పోస్టుకు 17 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. తాజాగా విడుదల 2020 జనవరి నోటిఫికేషన్ కు సంబంధించి ఒక్కో పోస్టుకు 67 మంది పోటీ పడుతున్నారు. తాజా నోటిఫికేషన్ ద్వారా 16,208 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా 10.96 లక్షలు మంది దరఖాస్తు చేసుకున్నారు. 2019 జులై లో 1,26,728 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారు
పోస్టుల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు
పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టుల తో కూడిన క్యాటగిరి-1 లో మొత్తం 1,025 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 4,53,531 మంది దరఖాస్తు చేసుకున్నారు, 1134 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు 2,22,409 మంది, 1501 విఆర్వో, సెర్వేయర్ పోస్టులకు 1,13, 201 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జూలైలో జారీ చేసిన నోటిఫికేషన్ లో 9,886 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులకు కేవలం 6265 మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన నోటిఫికేషన్ లో 6, 858 పశుసంవర్ధక శాఖ కార్యదర్శి పోస్టులకు 44,691 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం