• Tue. Oct 19th, 2021

త్వరలోఅందుబాటులోకి కొత్త రూపాయి నోట్లు |one rupee note coming soon in india |ap latest news

Byadmin

Feb 11, 2020

త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఒక రూపాయి నోటు

భారతదేశంలో త్వరలో కొత్త ఒక రూపాయి నోట్లు అందుబాటులోకి రానున్నాయి వీటిని కేంద్ర ఆర్థికశాఖ ముద్రించనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే కరెన్సీ నోట్లపై ఆర్.బి.ఐ గవర్నర్ సంతకం ఉంటే, ఆర్థిక శాఖ ముద్రించే రూపాయి నోటు పై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఉండనుంది.

ఈ కొత్తగా రాబోతున్న రూపాయి నోటు కు అనేక ప్రత్యేకతలు ఉండబోతున్నాయి ఈ రూపాయి నోటు పై “గవర్నమెంట్ ఆఫ్ ఇండియా” ” bharat sarkar” అనే పదాలు ఉంటాయి నోట్ పై ఆర్థిక శాఖ కార్యదర్శి చక్రవర్తి సంతకం రెండు భాషల్లో ఉంటుంది. “₹” ఈ గుర్తు ఉన్న రూపాయి కాయిన్ ను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారు

2020 సంవత్సరంతో పాటు సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. కుడివైపు కింది భాగంలో బ్లాక్ కలర్ లో నెంబరింగ్ ఉటుంది. మొదటి మూడు ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఒకే సైజు లో ఉంటాయి

భారతదేశంలో వ్యవసాయ రంగానికి గుర్తుగా”₹” సింబల్ ను ధాన్యాలతో డిజైన్ ఉంటుంది. 15 భాషల్లో ఒక్క రూపాయి అని రాసి ఉంటుంది. కొత్త రూపాయి నోటు పింక్ గ్రీన్ రంగులో ఉండనుంది. రూపాయి నోటు సైజు 9.7×6.3 సెంటీమీటర్లు. అశోక పిల్లర్, సత్యమేవ జయతే, 1 నెంబర్, భారత్ అనే పేరు అలాంటివి కరెన్సీ నోటు పై ఉండనున్నాయి