• Tue. Oct 19th, 2021

నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం

Byadmin

Jul 30, 2020

నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నేడు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలాగే మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మారుస్తూ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయనుంది. బిల్లులో ఈ క్రింది అంశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి.

👉 మానవవనరుల శాఖను విద్యాశాఖగా మార్పు.
👉 మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన..ఆపై మనఇష్టం.
👉 మూడు నుంచి 18 ఏళ్ల వరకు అందరికీ విద్య తప్పనిసరి.
👉 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యం.
👉 ఆరో తరగతి నుంచి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్.
👉 6వ తరగతి నుంచే ఒకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు.
👉 M.Phil కోర్సును పూర్తిగా తొలిగింపు.
👉 ప్రస్తుతం 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విద్యావిధానం..కాగా ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం.


👉 డిగ్రీ విద్య మూడు నుంచి నాలుగేళ్లు.
👉 పీజీ విద్య ఏడాది లేదా రెండేళ్లు.
👉 ఇంటర్ విద్య ఉండదు.
👉 ఇంటిగ్రేటెడ్ పీజీ, UG విద్య ఐదేళ్లు.
👉 దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకటే కరిక్యులమ్.
👉 పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం.
👉 ఇక నుంచి కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయ కేవలం 12వ తరగతి వరకు మాత్రమే.
👉 రీసెర్చ్ ఇంటెన్సివ్ లేదా టీచింగ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలు, మోడల్ మల్టీ డిస్సిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలకు ఆమోదం.