• Tue. Aug 16th, 2022

నేటి నుంచి కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ|ysr pension scheme details

Byadmin

Feb 17, 2020

నేటి నుంచి కొత్త పెన్షన్ కార్డులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం లోని పెన్షన్ పొందే లబ్ధిదారుల అందరికీ ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి పంపిణీ చేయనుంది వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా ఈ నెల 17 నుంచి 20 వ వరకు నాలుగు రోజులపాటు వాలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ప్ సీఈవో రాజబాబు తెలిపారు

ఫిబ్రవరి నెలలో కొత్తగా పింఛన్లు మంజూరు అయిన వారికి పింఛన్ పుస్తకంతో పాటు గుర్తింపు కార్డు ఇవ్వనున్నారు మిగిలిన పాత పింఛనుదారులు అందరికీ ఇప్పటికే పింఛన్ పుస్తకాల పంపిణీ చేసిన నేపథ్యంలో వారికి కొత్తగా కేవలం గుర్తింపు కార్డులు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు వివరించారు. అలాగే అనర్హులుగా తేలిన వారికి సంబంధించి ప్రస్తుతం రీ సర్వే జరుగుతుందని ఇందులో అర్హులుగా తేలిన వారికి మార్చి ఒకటో తేదీన గుర్తింపు కార్డులు ఇస్తున్నట్లు ప్రకటించారు

రాష్ట్రంలో ఇప్పటికే కొత్తగా6,14, 244 మందికి పింఛన్లు మంజూరు మంజూరు చేయడం జరిగింది