నేటి నుంచి జగన్న వసతి దీవెన అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్న పథకాల్లో ఒకటైన జగనన్న వసతి దీవెన పథకాన్ని నేడు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. దీని ద్వారా విద్యార్థుల భోజనం, వసతి సదుపాయాలు కింద ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం11.87 లక్షల మంది ఐటిఐ, పాలిటెక్నికల్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది ఈ పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు 10000, పాలిటెక్నికల్ విద్యార్థులకి 15000, డిగ్రీ ఆపై కోర్సులు చదువుతున్న వారికి 20 వేల చొప్పున హాస్టల్ మెసేజ్ చార్జీల కింద రాష్ట్రప్రభుత్వం చెల్లించనుంది
ఈ మొత్తాన్ని రెండు విడతల్లో విద్యార్థుల తల్లులకు ఖాతాలో జమ చేయ నున్నారు. దీనిలో భాగంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి యూనిక్ బార్కోడ్ తో కూడిన స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. ఈనెల 25 నుంచి గ్రామం వాలంటీర్లు వాటిని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అందించనున్నారు సంవత్సర ఆదాయం 2.5 లక్షల వరకు ఉండే కుటుంబాలకు ఈ పథకం వర్తింపచేయాలి ఉన్నారు
మొత్తం రెండు విడతలుగా నగదు చెల్లింపు
తొలి విడతలో ITI విద్యార్థులకు 5000, పాలిటెక్నికల్ విద్యార్థులకి 7500, డిగ్రీ పీజీ ఆపై చదువుతున్న విద్యార్థులకు పదివేలు చొప్పున మొదటి విడతగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు