నేడే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్  ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సంయుక్తంగా గేట్‌ వే హోటల్‌లో ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను హాల్‌టికెట్‌ లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఆధారంగా బీఐఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ (https://bie.ap.gov.in/)తో పాటు ఇతర వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. ఇక మార్కులు మెమోలు 15వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

కాగా ఫలితాలను తొలిసారిగా క్లౌడ్ సర్వీస్ ద్వారా విడుదల చేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాల డేటా కావలసిన వెబ్‌సైట్లు, ఇతరులు తమ సమాచారాన్ని ముందుగా బోర్డుకు అందించాలన్నారు. వెబ్‌సైట్‌ల నిర్వాహకులు వెబ్‌సైట్ పేరు, యూఆర్‌ఎల్ వివరాలు అందించాలి. ఇతరులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ అందించాలి. ఈ వివరాలను probieap@gmail.comకు పంపించాలి అని తెలిపారు

ఇంటర్ ఫలితాలు కోసం కింద ఉన్న వెబ్సైటు లింక్ ని క్లిక్ చేయండి

https://bie.ap.gov.in

www.sakshieducation.com

www.andhrajyothy.com

www.vidyavision.com

http://examresults.ap.nic.in

www.exametc.com

https://telugu.news18.com

http://results.prajasakti.com

www.indiaresults.com

https://results.bie ap.gov.in

results.eenadu.net

www.manabadi.com

www.schools9.com

www.examresults.net