
రేషన్ డోర్ డెలివరీ లో భారీ మార్పులు
మొబైల్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ
ఒక కుటుంబానికి ఒకేసారి సంచులు పంపిణీ
సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేషన్ పంపిణీ విధానం అమలు
ఆంధ్రప్రదేశ్లో రేషన్ డోర్ డెలివరీ కి సంబంధించి ప్రభుత్వం సరికొత్త విధానాలని అందుబాటులోకి తీసుకురానుంది ఇంతకాలం సంచుల్లో రేషన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం. వీటిలో సమూల మార్పులు చేస్తూ ఇంటి ముందేమొబైల్ వాహనాల ద్వారా రేషన్ కాటా వేసి వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల కి అందజేయనుంది
అంటే ఇక నుంచి 5, 10, 15, 20 కేజీల సంచులు ఉండవు. వీటికి బదులుగా కాటా ఉండే మొబైల్ వాహనాలని లబ్ధిదారుల ఇంటి ముందుకు తీసుకెళ్లి అక్కడే తూకం వేసి బియ్యం ఇతర సరుకులను పంపిణీ చేయనున్నారు. ఈ సరికొత్త విధానం రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది
వీటికోసం 13, 370 ట్రాలీలను కొనుగోలు చేసి గ్రామ, వార్డు సచివాలయాలకు అందజేసి వీటి నిర్వహణ ను వాలంటీర్లకు అప్పగించనున్నారు. వాలంటీర్లు ఈ మొబైల్ వాహనాల ద్వారా నే ప్రతి నెల ఇంటింటికి రేషన్ సరఫరా చేయాల్సి ఉంటుంది
దీనిలో భాగంగా రేషన్ కార్డుదారుల ఇంటింటికి ఒకటి లేదా రెండు సంచులను ఉచితంగా అందిస్తారు. వీటి ద్వారానే ప్రతి నెల లబ్ధిదారులు రేషన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది
SHARE THIS POST TO ALL Groups