బ్యాంక్ లోన్ వినియోగ దారులకి శుభవార్త

బ్యాంక్ ఖాతాదారులకు RBI శుభవార్తను అందించింది రిస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ లో భాగంగా ఖాతాదారులకు కొత్త సర్వీస్ లు అందుబాటులోకి తీసుకోని వచ్చింది ఏకంగా రెండేళ్లు వరకు EMI మారటోరియం సదుపాయం కల్పిస్తుంది. దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్న వారికి ఊరట కలిగె నిర్ణయం తీసుకుంది RBI స్కీం కు అనుగుణంగా రిస్ట్రక్చరింగ్ బెన్ఫిట్ను రిటైల్ కస్టమర్లకు అందిస్తుంది

సెప్టెంబర్ నెల 2020 నుంచి 24 నెలల పాటు అంటే రెండు సంవత్సరాలు పాటు EMI మారటోరియం ప్రయోజనాన్ని కల్పిస్తుంది ఈ సౌకర్యాన్ని SBI 2020 మార్చ్ 1 లోపు ఋణం తీసుకున్న వారికి మాత్రమే అందుబాటులోకి ఉంచింది త్వరలోనే HDFC, ICICI బ్యాంక్లు కూడా ఈ నిర్ణయం తీసుకోనున్నాయి

ఈ మారటోరియం కి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవాళ్లు కింద ఇచ్చిన బ్యాంక్ వెబ్ సైట్ లింక్ ని క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి

https://www.sbi.co.in/

మారటోరియం అర్హతకు కావాల్సిన డాక్యుమెంట్స్ : ఫిబ్రవరి నెల శాలరీ స్లిప్ అలాగే సెప్టెంబర్ నెల లేదా లేటెస్ట్ నెల శాలరీ స్లిప్ కూడా అవసరం లోన్ మారిటోరియం ముగింపు తరువాత ఎంత ఆదాయం వస్తుందో డిక్లరేషన్ కూడా ఇవ్వాలి అది జాబ్ పొతేనే ఆ లెటర్ అందించాలి.
బ్యాంక్ శాలరీ అకౌంట్ స్టేట్మెంట్ కూడా అందించాలి అదే బిజినెస్ చేస్తుంటే కోవిడ్ కారణంగా వ్యాపారం దెబ్బతిన్నది అని డిక్లరేషన్ ఇవ్వాలి