మే నెలలో బ్యాంక్ లు 12 రోజులు మూత

భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంది దీంతో బ్యాంకుల సమయాల్లో కూడా మార్పులు చేసారు రోజికి కేవలం నాలుగు గంటలు మాత్రమే 50 శాతం ఉద్యోగులు తో పనిచేస్తున్నాయి.

ఇంక మే నెలలో ముఖ్యమైన లావాదేవీలు ఏమైనా ఉంటే డిజిటల్ పేమెంట్స్ బెటరని నిపుణులు సూచిస్తున్నారు దీనికి కారణం మే నెల మొత్తం 31 రోజులుంటే..12 రోజుల పాటు బ్యాంకులకు సెలవు రానున్నాయి

ఎప్పటిలాగానే శనివారం, ఆదివారాలతో పాటు, ఇతర పండుగలు రావడంతో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు

మొత్తం మే నెలలో ఐదు ఆదివారాలు వచ్చాయి (మే 2, మే 9, మే 16, మే 23, మే 30). అంతేగాకుండా మే 8వ తేదీ, 22వ తేదీన రెండో శనివారం, నాలుగో శనివారం వచ్చాయి. ఈ ఏడు రోజులు సాధారణ సెలవులు కావడంతో ఈ రోజుల్లో బ్యాంకులు పని చేయవు

ఇక మే 1వ తేదీ మేడే, మే 7వ తేదీ జుమాతుల్ విదా, మే 13వ తేదీన ఈదుల్ ఫితర్, మే 14వ తేదీ రంజాన్, మే 26వ తేదీన బుద్ధపూర్ణిమలు వచ్చాయి. మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి.