లాక్ డౌన్ కొత్త మార్గదర్శకాలు విడుదల

మే 3 వరకు లాక్ డౌన్ ని పొడగించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబందించిన కొత్త మార్గదర్శకాలు ను విడుదల చేసింది. ఏప్రిల్ 20 తరువాత లాక్ డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది ఈ సడలింపులు కరోనా హాట్ సాప్ట్ లకు వర్తించదు అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగనుంది

కొత్త మార్గదర్శకాలు.. 

  • కాఫీ, తేయాకు తోటల్లో 50 శాతం మ్యాన్‌పవర్‌కు అనుమతి
  • రాష్ట్ర సరిహద్దులు దాటేందకు వ్యక్తులను అనుమతి నిరాకరణ
  • అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
  • జాతీయ ఉపాధిహామీ పనులకు అనుమతి
  • ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి
  • రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి
  • విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు దుకాణలకు అనుమతి 
  • వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి
  • అనాథ, దివ్యాంగ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి
  • భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు
  • నిర్మాణ రంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులకు మాత్రమే అనుమతి