
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ సంఘటన పై సీఎం జగన్ స్పందిస్తూ ఈ సంఘటన జరగటం దురదృష్టకరమని . ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని సీఎం పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఎల్జీ పాలిమర్స్ భాదితులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా
వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారికి 10 లక్షణ ఆర్థిక సహాయం
చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం
ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి 25 వేల ఆర్థిక సహాయం
ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల అయినా. ఐదు గ్రామాల్లోని 15 వేల మందికి ఒక్కొక్కరికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిచనున్నారు
జంతువులను కోల్పోయిన వారికి 25 వేల ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నారు