
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో Dsc ప్రకటన రాష్ట్రము మొత్తం మీద 16,000 లకి పైగా ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ లెక్క తేల్చింది. వీటిలో 402 బ్యాక్ లాగ్ పోస్ట్లు భర్తీకి ఇప్పటి కే ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరో 15,926 పోస్ట్లు భర్తీకి ప్రభుత్వం కి ప్రతిపాదనలు చేరాయి . ఈ మేరకు మొదట మినీ Dsc ఆ తరువాత సాధారణ DSC నిర్వహించాలని విద్యా శాఖ భావిస్తుంది
ముందుగా బ్యాక్ లాగ్ పోస్ట్లు భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది ఇందులో మిగిలిన పోస్ట్లు లను జనరల్ కి మారుస్తారు నియామక పరీక్ష తోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష TET ను నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.
ఈసారి పాఠ్య ప్రణాలికను మారుస్తున్నారు ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి ప్రాధన్యం ఇవ్వటం తో అభ్యర్థులు లోని ఆంగ్ల నైపుణ్యన్ని పరీక్షించనున్నారు
SGT లకు పెన్ను పేపరుతో
DSC 2018 లో ఆన్లైన్ నియామకాల కారణంగా ఎదురైనా అనుభవాల దృష్ట్యా ఈసారి SGT లకు పెన్ను పేపర్ తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. స్కూల్ అసిస్టెంట్ ఇతరులు కు మాత్రం ఆన్లైన్ లోనే పరీక్షలు ఉండనున్నాయి
