• Sat. Oct 16th, 2021

ATM కార్డు లేకుండా ఫోన్‌తో గూగుల్ పే , ఫోన్ పే , పెటియం తో స్కాన్‌ చేసి ఏటీఎం నుంచి డబ్బులు ఇలా పొందండి

Byadmin

Apr 3, 2021

ATM కార్డు లేకుండా ఫోన్‌తో స్కాన్‌ చేసి ఏటీఎం నుంచి డబ్బులు ఇలా పొందండి

చేతిలో మనీ లేకుంటే డెబిట్ కార్డు తో మనం ఏటీఎం కి వెళ్లి డెబిట్ కార్డు పెట్టి, పిన్ ఎంటర్ చేసి డబ్బుల్ని పొందుతాం

కాని ఇకపై చేతిలో డెబిట్ కార్డు లేక పోయినా కూడా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు దీని కోసం మీ మొబైల్ లో ఉండే గూగుల్ పే, భీమ్, పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ వంటి యాప్ ద్వారా కోడ్ జనరేట్ చేసుకొని ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. చాల మందికి ఈ సర్వీసు గురించి తెలీదు. కానీ దీని వలన మంచి బెనిఫిట్స్ వున్నాయి

ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలని భావిస్తే యూపీఐ యాప్‌ను అంటే గూగుల్ పే, భీమ్, పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ వంటి యాప్లలో ఏదో ఒకటి ఓపెన్ చేయాలి.

ఆ తరువాత ఏటీఎంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి… ఎంత డబ్బులు తీసుకోవాలో ఎంటర్ చేసి ఆ తర్వాత ప్రొసీడ్‌ పై క్లిక్ చేయాలి ఇప్పుడు డిజిటల్ యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాగానే మీకు వెంటనే మీరు ఎంటర్ చేసిన అంమౌంట్ ఏటీఎం నుంచి వస్తుంది

ఇది ఇలా ఉండగా యూనో బ్యాంక్ ఇప్పటికే ఎన్‌సీఆర్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏటీఎం సేవలు ఈ బ్యాంక్ కస్టమర్లకు తొలిగా అందుబాటులోకి రానున్నాయి అయితే ఈ బ్యాంక్ 1500 ఏటీఎంలను కొత్త ఫీచర్‌తో అప్‌గ్రేడ్ చేసి అందుబాటులోకి తీసుకోని రానుంది