మీ ఆధార్ కి ఎ మైబైల్ నెంబర్ లింక్ అయిందో ఇలా చెక్ చేసుకోండి|How to check Your aadhra number linked mobile number

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ చేయటం అనేది తప్పనిసరిగా అవుతుంది. ప్రభుత్వం అందించే పథకాలు ద్వారా డబ్బులు పొందాలన్న మరియు బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవాలన్న , ప్రభుత్వ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోవాలన్న ఇలా ప్రతి దానికి ఆధార్ తప్పనిసరి ఈ నేపథ్యంలో చాలా మందికి వారి ఆధార్ కి “ఎ మొబైల్ నెంబర్ లింక్ ” చేసారో తెలియని పరిస్థితి ఉంది

. అసలు మీ ఆధార్ కి ఎ మొబైల్ నెంబర్ లింక్ చేసారో తెలుసుకోవాలి అనుకొనే వారు ముందుగా ఈ వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన “యూఐడీఏఐ వెబ్‌సైట్‌” లింక్ ఫైన క్లిక్ చేయగానే ఇలా కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో My Aadhaar సెక్షన్‌లో Aadhaar services లో Verify an Aadhaar Number పైన క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజీ కింద చూపిన విదంగా ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Proceed to Verify పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మరొక వెబ్ పేజీలో మీ Aadhaar Number కి సంబందించిన పూర్తి సమాచారo తోపాటు మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ చివరి 3 అంకెలు కనిపిస్తాయి. దీని ద్వారా మీరు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో క్లూ దొరుకుతుంది.👇

మొబైల్ నెంబర్ దగ్గర ఖాళీగా ఉంటే ఆ ఆధార్ నెంబర్‌కు ఏ ఫోన్ నెంబర్ లింక్ కాలేదని అర్థం. అప్పుడు మీరు మెుబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

మీ ఆధార్ కి ఎ మైబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకోటానికి కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

https://uidai.gov.in/