• Mon. Sep 26th, 2022

రైతులకు పీఎం కిసాన్ 8వ విడత 2,000. రూ ఈ తేదీనుంచి జమ

Byadmin

Apr 15, 2021

కేంద్ర ప్రభుత్వం దేశం లోని రైతుల కు పెట్టుబడి సహాయం అందించాలని ఉద్దేశం తో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా డబ్బులు వారి బ్యాంక్ ఎకౌంట్ లోకి జమ అవుతాయి. ఈ పథకం కింద ఏడాదికి ఆరువేల రూపాయలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సొమ్మును ఒకేసారి కాకుండా విడతల వారీగా సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.

సంవత్సరానికి మూడు విడతలుగా రెండు వేల చొప్పున అందిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు 8వ విడత డబ్బులు రైతులకు రావలసి ఉంది. రైతులు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తున్నారు.

Also read : YSR రైతు భరోసా 2021 అర్హుల జాబితా విడుదల లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి

ఏప్రిల్ 1 లేదా ఏప్రిల్ 8 నుంచి పీఎం కిసాన్ డబ్బులు రైతుల బ్యాంక్ ఎకౌంట్లలోకి వస్తాయని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పటి వరకూ ఈ డబ్బులు రైతులకు జమ కాలేదు . ఐతే ఇప్పుడు కేంద్రం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద ఈ నెల (ఏప్రిల్ )20 నుంచి 25 తేదీల మధ్యలో బ్యాంకు ఎకౌంట్లకు 2 వేల రూపాయలు జమ చేస్తారని ప్రకటించారు కేంద్ర మంత్రి కైలాష్ చౌదిరి ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దదాపు 11 కోట్ల రైతుల బ్యాంక్ ఖాతాలకు ఈ 8 వ విడత డబ్బులు ఈ నెలాఖరులోగా జమ కానున్నాయి