10th class 2021 public exams cancelled

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది.

అలాగే ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు కరోనా తీవ్రత ఎక్కువ అవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేసింది ఈ నేపథ్యంలో వైరస్ తీవ్రత కారణం గా తెలంగాణ రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది

తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద సుమారు 5.35లక్షల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. వీరందరినీ కూడా ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి పంపించిగా ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం.