• Fri. Dec 3rd, 2021

వైస్సార్ సున్నా వడ్డీ జమ కాని రైతులు ఇలా చేయండి మీకు ఎందుకు జమ కాలేదో తెలుస్తుంది

Byadmin

Apr 22, 2021

2019 ఎలక్షన్ లో రైతులకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా ఏప్రిల్ 20 వ తేదీన ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల ఖాతాలోకి జమ చేశారు .

ఈ వైస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం 128.47 కోట్ల వడ్డీ రాయితీ‌ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.

సరైన అర్హతలు ఉండి ఇంక వైస్సార్ సున్నా వడ్డీ డబ్బులు జమ కాని రైతులు ఎవరైనా ఉంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మీ బ్యాంక్ ఖాతాలకు సున్నా వడ్డీ డబ్బులు ఎందుకు జమ కాలేదో అడిగి తెలుసుకోవచ్చు