కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కోసం ఆన్లైన్ లో మీ పేరును ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

మే 1 నుంచి దేశ వ్యాప్తంగా 18-45 సంవత్సరాల లోపు వారికి కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ని అందించనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

ఐతే ఏప్రిల్ 28 నుంచి 18-45 సంవత్సరాలవారికి కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కోసం ముందుగానే రిజిస్టర్‌ చేసుకోనే అవకాశాన్ని ప్రభుత్వం కలిపించింది

ఈ నేపథ్యంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కోసం ముందుగానే రిజిస్టర్‌ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది

అక్కడ ‘రిజిస్టర్‌/సైన్‌ఇన్‌ యువర్‌ సెల్ఫ్‌’అనే ట్యాబ్‌ మీద క్లిక్‌ చేయడం ద్వారా మీ రిజస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను ఉపయోగించి కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవచ్చు

మన దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం అధీకృత మొబైల్‌ యాప్‌ లేదు. కోవిన్‌ పోర్టల్‌ ద్వారానే రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆరోగ్య సేతు ద్వారా కూడా రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి 45 ఏళ్లు దాటిన వారంతా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. మే1 తేదీకి 18 ఏళ్లు నిండిన వారంతా బుధవారం నుంచి కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాసంకల్పించింది

కోవిన్‌ పోర్టల్‌లో మీ పేరు రిజిస్టర్‌ చేసుకోగానే వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌ నిర్ధారణ జరిగిన వెంటనే వ్యాక్సినేషన్‌ కేంద్రం, వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన రోజు, సమయం తదితర వివరాలన్నీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తాయి. మీరు ఈ వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు

కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ 👇

www.cowin.gov.in