• Wed. Jan 26th, 2022

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పని వేలలు మార్పు

Byadmin

May 7, 2021

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడే లక్ష్యంగా పగటి పూట కూడా కర్ఫ్యూ అమల్లో కి తీసుకోని వచ్చిన ప్రభుత్వం , ఉద్యోగుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రోజున ఉత్తర్వులను జారీ చేసింది. కర్ఫ్యూ నేపథ్యంలో ఉద్యోగుల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఉండాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని అన్ని హెచ్‌డీవో కార్యాలయాలు, సెక్రటెరియట్‌, జిల్లా కార్యాలయాలు, సబ్‌ డివిజన్‌ కార్యాలయాల్లో ఈ మేరకు అమలులో రానుంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉండాలంటే ఉద్యోగులకు కచ్ఛితంగా పాసులు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. అలాగే అత్యవసర సర్వీసులకు యధావిధిగా మినహాయింపు ఉంటుంది