మీ ఫోన్ లో రేడియేషన్‌ ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోండి

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉండని వ్యక్తులు ఎవరు ఉండరు అలాగే మీరు వినియోగిస్తున్న ఫోన్‌లో రేడియేషన్‌ ఎంత ఉందో 1నిమిషంలో ఇలా తెలుసుకోవచ్చు

సహజంగా ప్రతీ ఫోన్‌లో “Specific Absorption Rate ” (సార్‌) అని ఒక ప్రమాణం ఉంటుంది. ఇది మన ఇండియాలో 1.6 వాట్స్‌ పర్‌ కేజీ ఉంది. అలాగే మీరు వినియోగిస్తున్న ఫోన్‌ తప్పనిసరిగా ఆ పరిమితికి లోబడి ఉండాలి మీ ఫోన్‌లో ఒక ప్రత్యేకమైన కమాండ్‌ జారీ చేయడం ద్వారా ఈ రేడియేషన్ తెలుసుకోవచ్చు.

దీనికోసం ముందుగా మీ ఫోన్‌ని ఓపెన్‌ చేసి మీ ఫోన్ కీ పాడ్ లో *#07# అనే బటన్లను ప్రెస్‌ చేయగానే వెంటనే స్ర్కీన్‌ మీద మీ ఫోన్‌లో ఉన్న సార్‌ వాల్యూ ఎంత ఉందో చూపిస్తుంది. మీ ఫోన్ లో కనుక పైన చెప్పబడిన 1.6 W/kgలోపు ఉంటే మీ ఫోన్ లో రేడియేషన్ నార్మల్ స్టేజ్ లో ఉన్నట్లు. అయితే కొన్ని కంపెనీలు తయారు చేసే ఫోన్లు 1.6 W/kg కన్నా ఎక్కువ రేడియేషన్‌ ఉత్పత్తి చేస్తున్నాయి