తెలంగాణ లో రేపటి నుంచి లాక్ డౌన్

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ విధించినప్పటికి మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో తెలంగాణ హైకోర్టుతో సహా పలు సంస్థలు లాక్‌డౌన్‌ విధించిడమే సరైన మార్గం అని నిర్ణయించాయి

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మే 12 నుంచి లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది.రేపు ( బుధవారం) ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి రానున్నట్లు ఈ మేరకు కేబినెట్‌ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కేబినెట్ నిర్ణయించింది.