అనందయ్య మందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అనందయ్య మందు కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్ట కేలకు అనుమతి లభించింది. కరోనా రోగులకు ఆనందయ్య మందు ఇవ్వవచ్చంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరి ఇష్టానుసారం వారు మందును వాడుకునేందుకు పర్మిషన్‌ లభించ్చింది. ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. సీసీఏఆర్‌ఎస్‌ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే అనందయ్య మందు వాడితే కచ్చితంగా కరోనా తగ్గుతుంది అనేందుకు ఆధారమైన నివేదిక ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆనందయ్య ఇచ్చే మందుల వల్ల హానీ లేదని తేలింది.