జూన్ నెలలో బ్యాంకు లకు 9 రోజులు సెలవులు ఇవే

దేశీయ కేంద్ర బ్యాంక్ బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో ముందుగానే తెలియజేసింది. బ్యాంక్ సెలవులు రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే.. మరో రాష్ట్రంలో సెలవు ఉండకపోవచ్చు. బ్యాంకులో పని ఉండే వారు బ్యాంక్ సెలవులు ముందే తెలుసుకుంటే దానికి అనుగుణంగా బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.

మాములుగా ఆదివారం, రెండు నాలుగో శనివారాలు మినహాయించి కూడా బ్యాంకులకు మళ్లీ కొన్ని రోజులు సెలవులు ఉండొచ్చు. అందువల్ల బ్యాంక్ ఖాతా కలిగిన వారు బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయో ముందే తెలుసుకోండి

జూన్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే👇

జూన్ 6 – ఆదివారం
జూన్ 12 – రెండో శనివారం
జూన్ 13 – ఆదివారం
జూన్ 15 – వైఎంఏ డే/ రాజా సంక్రాంతి (మిజోరం, భువనేశ్వర్‌లో బ్యాంకులు పని చేయవు)
జూన్ 20 – ఆదివారం
జూన్ 25 – గురు హర్‌గోవింద్ జయంతి (జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు క్లోజ్)
జూన్ 26 – నాలుగో శనివారం
జూన్ 27 – ఆదివారం
జూన్ 30 – రేమ్నా ని (ఇజ్వాల్‌లో బ్యాంకులు పని చేయవు)

ఇంక ఆంధ్రప్రదేశ్ లో ఐతే జూన్6,జూన్12,జూన్ 13,జూన్ 20,జూన్ 26, జూన్ 27 తేదీల్లో మాత్రమే బ్యాంకులకు సెలవలు రానున్నాయి