మీకు pm కిసాన్ డబ్బులు రావటం లేదా ఐతే ఇలా పిర్యాదు చేయండి? వెంటనే మీకు డబ్బులు వస్తాయి

కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పీఎం కిసాన్ యోజన పథకంని ప్రారంభించింది.ఈ పథకం ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 6 వేలని కేంద్రం జమ చేస్తుంది. అయితే ఈ డబ్బు మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారిగా రైతుల ఖాతాల్లోకి వచ్చి చేరుతుంది. ఇప్పటికే 8 విడత డబ్బులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేసింది.

అయితే ఈ డబ్బులు కేవలం పీఎం కిసాన్ పథకంలో రిజిస్టర్ అయిన వారికి మాత్రమే వస్తాయి. ఇప్పటికే ఇందులో ఎంతోమంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తాజాగా కేంద్రం 8వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయగా.. ఎంతోమంది రైతులు ఈ డబ్బులను అందుకున్నారు. అయితే కొంతమంది రైతులకు ఈ పీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాల్లో జమకాలేదు. ఇలాంటి రైతులు ఒకవేళ మీ అకౌంట్లోకి డబ్బులు జమ కాకపోతే మీరే స్వయంగా మీ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు . ఆ తర్వాత మీకు డబ్బులు వస్తాయి.

అయితే ఫిర్యాదు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పీఎం కిసాన్ డబ్బులు రానివారు 011-24300606 నెంబర్‌కు కాల్ చేసి చెప్పవచ్చు. అలాగే ఇంకా పలు హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 18001155266, 155261, 011-23381092, 011 23382401 వంటి నెంబర్లకు కూడా కాల్ చేయొచ్చు. కేవలం ఫోన్ ద్వారానే కాకుండా ఇమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం మీరు pmkisan-ict@gov.inకు ఇమెయిల్ పంపాలి. ఇక ఇందులో చేరని రైతులు ఇప్పటికీ ఈ పథకంలో చేరి డబ్బులను అందుకోవచ్చు