AP TET 2021 SYLLABUS RELEASED

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ముందుగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)–2021 పేపర్ల విధివిధానాలు, సిలబస్‌ను AP రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం విడుదల చేశారు

ఈ సిలబస్‌ను ‘http://aptet.apcfss.in అందుబాటులో ఉంచామని విద్యా శాఖమంత్రి తెలిపారు. టెట్‌ నిర్వహణపై ప్రభుత్వం 2021 మార్చి 17న జీవో 23 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది .

టెట్‌లో రెండు పేపర్లు..
👉టెట్‌లో 2 పేపర్లు (పేపర్‌–1, పేపర్‌–2) ఉంటాయి. పేపర్‌ 1–ఏ, 1–బీ, 2–ఏ, 2–బీలుగా వీటిని నిర్వహిస్తారు.
👉 రెగ్యులర్‌ స్కూళ్లలో 1–5 తరగతుల టీచర్‌ పోస్టులకు పేపర్‌ 1–ఏలో అర్హత సాధించాలి.
👉దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్‌ స్కూల్స్‌లో 1–5 తరగతులు బోధించాలంటే పేపర్‌ 1–బీలో అర్హత తప్పనిసరి.
👉రెగ్యులర్‌ స్కూళ్లలో 6–8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్‌ 2–ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్‌ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్‌ 2–బీలో అర్హత తప్పనిసరి.

AP TET 2021 SYLLABUS DOWNLOAD CLICK BELOW LINK 👇

https://drive.google.com/file/d/1xxcY4v9KGi_mLWmnenMF7DvAMx8BqaAv/view?usp=drivesdk