జగనన్న అమ్మ ఒడి
ప్రతి పేద పిల్లవాడు చదువుకోవాలని ఉద్దేశంతో ప్రారంభించిన పథకం అమ్మఒడి పథకం. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడికి పిల్లలను పంపించే తల్లుల అకౌంట్లో 15,000 జమ చేయడం జరిగింది
అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందిన ప్రతి తల్లి అకౌంట్ నుంచి తిరిగి వె 1000 రూపాయలు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది దీని ఆప్షన్ కాకుండా తప్పనిసరి చేస్తూ తాజాగా ఆదేశాలను జారీ చేసింది
అమ్మఒడి పథకం నుంచి లబ్ధిపొందిన తల్లులు లేదా సంరక్షకులు నుంచి 1000 వసూలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ v. చిన వీరభద్రుడు ఆదేశాలను జారీ చేశారు
తల్లులు నుంచి వెనక్కు తీసుకునే ఈ వెయ్యి రూపాయలతో రాష్ట్రంలోని 44570 ప్రభుత్వ పాఠశాలల్లోని పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పరచాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
అలా అమ్మఒడి పథకం ద్వారా వెనక్కు తీసుకున్న వెయ్యి రూపాయలతో పాఠశాలలోని బాత్రూములు శుభ్రం చేసే ఆయనకు నెలకు నాలుగు వేలు వేతనంగా ఇవ్వాలని దాంతోపాటు బాత్రూం లో ని శుభ్రం చేసేందుకు అవసరమయ్యే బ్రష్ లు చీపుర్లు ఫినాయిల్ కు నెలకు 2000 కూడా అమ్మబడి ద్వారా వెనక్కు తీసుకున్న వెయ్యి రూపాయల ద్వారా వచ్చే డబ్బుతో కాంపోజిట్ గ్రాండ్ కింద ఖర్చు పెట్టుకునేలా జారీ చేశారు
ఈ మేరకు ఈ నెల 30న ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పరిచి కమిటీలను ఎంపిక చేసి ఆ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాల్ని చేపట్టనున్నారు