ఆంధ్రప్రదేశ్ పదవతరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ జూలై -2020 పై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాస్ పరీక్షలు యథాతథం
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. జులై 10 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మార్చి నెలాఖరులో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కరోనా కారణంగా జూలై లో నిర్వహిస్తుండటం తెలిసిందే.