ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ లో 1,945 ఉద్యోగాలు ఖాళీలు
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత కి శుభవార్త అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికి అనుగుణంగా అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ నేరబ్ కుమార్ ప్రసాద్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశిభూషణ్ వివిధ విభాగాల అధికారులతో బుధవారం సమీక్షించారు.
ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయనున్న అటవీశాఖ లో 51 శాతం ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర అటవీ దళాల అధిపతి ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. అటవీ సంపద పరిరక్షణ, పచ్చదనం పెంపునకు క్షేత్రస్థాయిలో పోస్టుల భర్తీ తప్పనిసరి అని తెలిపారు 39 కేడర్ లకు సంబంధించి మొత్తం 1,945 పోస్టుల భర్తీకి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన నివేదికలో కోరారు
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను అటవీశాఖ నె శరీర దారుఢ్య పరీక్షలు రాత పరీక్షల ద్వారా భర్తీ చేసేది. అయితే వైయస్ జగన్ సర్కార్ అత్యంత పారదర్శకంగా ప్రతిభ కొలమానంగా పోస్టుల భర్తీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని స్థాయి పోస్టుల భర్తీ ప్రక్రియను APPSC కె అప్పగించాలని నిర్ణయించింది
అలాగే రెవెన్యూ శాఖలో డిప్యూటీ తాసిల్దారు లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పోస్టులు ఖాళీలు ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పోస్టులు ఎక్కువ ఖాళీలు ఉన్నందున ఇబ్బంది ఉందని వివరించారు చాలాకాలం నుంచి పోస్టుల భర్తీ చేయకపోవడం వల్ల అన్ని శాఖలో ఖాళీలు ఉన్నాయని విభాగాల అధిపతులు చెబుతున్నారు. విభాగాల వారీగా ఖాళీలు సమర్పించాలని సూచించారు.
ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించిన క్యాలెండరు ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కానుంది