• Tue. Oct 19th, 2021

AP NEW RICE cards DETAILS |ap rice cards release |Rice cards latest update

AP NEW RICE CARDS DETAILS

ఆంధ్రప్రదేశ్లో కొత్త బియ్యం కార్డులు సిద్ధం

15 నుంచి పంపిణీ చేయనున్న వాలంటీర్లు

కొత్త బియ్యం కార్డు లో కుటుంబసభ్యుల పుట్టిన తేది వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తయింది. ఈనెల 15 నుంచి గ్రామ, వార్డ్ వాలంటీర్లు లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు అందించింది. గతంలో ఉన్న1.47 కోట్ల రేషన్ కార్డులను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనుంది.

AP New rice card

జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 పేరిట బియ్యం కార్డులను ముద్రించారు. కొత్త కార్డుల్లో కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో ను రద్దు చేసి కార్డు ఎవరి పేరున మంజూరైందో వారి ఫోటో ని ముద్రించడం జరిగింది కార్డు లో నమోదైన కుటుంబ సభ్యుల పేరిట వేరువేరుగా ఐడి నెంబర్ లు ఇవ్వటం జరిగింది, కార్డులు ఎ రేషన్ డీలర్ పరిధిలోకి వస్తుందనే వివరాలు కూడా కార్డులో పొందుపరిచారు. ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డు లో సభ్యుల వయసు మాత్రమే ఉండేది. కొత్త కార్డు లో పుట్టిన తేది తో సహా ముద్రించారు కార్డుల్లో పేర్లు ఇతర సమాచారం తప్పు లేకుండా ఉండేందుకు గ్రామం వార్డు వాలంటరీ ల ద్వారా మరోమారు క్షేత్రస్థాయిలో విచారించి వివరాలు సరైనవే అని లబ్ధిదారులు ఆమోదించాకే కార్డులు తయారు చేశారు.

కార్డు లో తెలుగుతోపాటు ఇంగ్లీషులోనూ వివరాలు ఉన్నాయి సరుకులు అందుకుంటే ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నెంబర్స్1902/1967/1800425002