Ap new rice cards latest update |rice cards latest news

ఆంధ్రప్రదేశ్లో బియ్యం కార్డులకు సంబంధించి అర్హుల జాబితాను నాలుగు రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనుంది ప్రస్తుతం ఉన్న 1.47 కోట్ల తెల్లరేషన్ కార్డుల వివరాలను గ్రామ వాలంటీర్లకు అందజేసి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించారు నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు తదితర కారణాలతో దాదాపు 18 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ప్రభుత్వ నిబంధనల మేరకు కొంతమంది తాము బియ్యం కార్డులను పొందటానికి అర్హులమేనని పేర్కొంటూ పున పరిశీలన కోసం 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు

వీటిపై గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ విచారణ సాగిస్తున్నారు నాలుగు రోజుల్లో ఈ పని పూర్తి చేయనున్నారు ఆ వెంటనే అర్హుల జాబితాను గ్రామ సచివాలయం లో అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అర్హుల ఎంపిక ప్రక్రియ ఆ జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించడం తో పాటు ఎక్కడ అవినీతి లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఇప్పటి వరకు బియ్యం కార్డు లేని మరో 1.50 లక్షల మంది గ్రామ సచివాలయ ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు

పున పరిశీలన లో జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తు వివరాలు

గుంటూరు జిల్లాలో 98 వేల 35, నెల్లూరులో 64519, కృష్ణాలో 95, 716, కడపలో 50,446, చిత్తూరులో66, 407, ప్రకాశంలో 55,446, అనంతపురంలో64, 758, తూర్పుగోదావరిలో86, 842, కర్నూల్ లో55, 253, విశాఖపట్నంలో57, 198, పశ్చిమ గోదావరిలో60, 540, విజయనగరంలో31, 247, శ్రీకాకుళంలో31, 982 పున పరిశీలన కోసం దరఖాస్తులు అందాయి