• Tue. Aug 16th, 2022

AP RICE CARDS SPLIT OPTION ENABLE |ఆంధ్రప్రదేశ్ లో ఒంటరి వ్యక్తులకు రేషన్ కార్డు పంపిణీ

Byadmin

Sep 2, 2020

ఆంధ్రప్రదేశ్ లో ఒంటరి వ్యక్తులుకు నూతన రేషన్ కార్డ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఒంటరి వ్యక్తులు కు కార్డు పంపిణీ చేసే విధానం లేదు కార్డు మంజూరై అందరు చనిపోయి ఒక్కరే ఉంటే ఆ కార్డుల్ని కొనసాగించే వారు అందరూ దూరమై ఒంటరిగా ఉంటున్న వ్యక్తులు కార్డు లేక రేషన్ సరుకులతోపాటు సామజిక భద్రత పింఛన్లు పొందలేకపోతున్నారు

ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి కూడా కార్డులు ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది సచివాలయం లో దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే కార్డులు మంజూరు చేసేలా vro లోకి ప్రత్యేక లాగిన్ ఇచ్చి విచారణ నివేదిక పౌరసరఫరాల శాఖ కమిషనర్ వెబ్ సైట్ లో పొందుపరిచేలా చర్యలు తీసుకున్నారు

50 సంవత్సరాలు పైబడి ఒంటరిగా ఉంటున్న పురుషుడు లేదా మహిళల, భర్త చనిపోయి పిల్లలు లేక ఒంటరిగా ఉంటున్న మహిళలు, భార్య పిల్లలు లేకుండానే ఒంటరిగా ఉంటున్న పురుషుడు, ట్రాన్స్ జెండర్లు కొత్త కార్డు కోసం దరకాస్తు చేసుకోవచ్చు

క్షేత్ర స్థాయిలో విచారణ చేసి అర్హత ఉంటే కార్డ్స్ మంజూరు చేస్తామని తాసిల్దార్లు చెప్పారు. ప్రస్తుతం దారకాస్తులు స్వీకరిస్తున్నారు. కార్డు జారీలో జాప్యాన్ని నిలువరించడం లో భాగంగా గ్రామ, వార్డ్ సచివాలయలకు ప్రింటర్ కూడా అందచేశారు. వాటితో కొత్త కార్డులు ప్రింట్ తీసి ఎప్పటి కప్పుడు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు