• Wed. May 25th, 2022

ఆంధ్రప్రదేశ్ 2020 టెట్ & డిఎస్సి నోటిఫికేషన్ డీటెయిల్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త ని అందించనుంది. ప్రస్తుత లాక్ డౌన్ పూర్తికాగానే టెట్ -3 నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. TET, Dsc లను వేరువేరుగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం, “ఉపాధ్యాయ అర్హత పరీక్ష” TET-3 ను ఆన్లైన్లో చేపట్టాలని నిర్ణయించారు. టెట్ -3 ని ఆన్ లైన్ లో నిర్వహించిన అనంతరం సుమారు 9 వేల పై చిలుకు పోస్టులతో డీఎస్సీ 2020 నిర్వహించే అవకాశం ఉన్నట్లు విద్యా శాఖ వెల్లడించింది. డీఎస్సీ 2020 కి సంబంధించి ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం, మూడు వేల పోస్టుల వరకు స్కూల్ అసిస్టెంట్లు, 300 వరకు పిజీ టీ, టీజిటి లు, 5 వేలు కు పైగా ఎస్జిటి లు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

శ్రీకాకుళం 550
విజయనగరం 471
విశాఖపట్నం 549
తూర్పుగోదావరి 2097
కృష్ణ 600


పశ్చిమగోదావరి 507
గుంటూరు 520
నెల్లూరు 575
అనంతపురం 471
కడప 543
కర్నూలు 1, 546
పోస్టులు ఖాళీగా ఉన్నాయి ” కాగా చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఒకట్రెండు రోజులు సమాచారం అందనుంది.